BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 03 September 2026, 07:46 pm
Posted by : DAVU RAVINDER REDDY

నిర్మాణ వ్యర్థాల డిస్పోజల్ సర్టిఫికేట్ తప్పనిసరి!

తెలంగాణ
/ హైదరాబాద్
03 Sep, 2026 - 07:46 PM
38 వీక్షణలు

బిల్డింగ్‌ పర్మిషన్లలో కొత్త నిబంధనలు.. అక్రమ డంపింగ్‌కు చెక్

హైదరాబాద్ | Ntoday News

నిర్మాణ వ్యర్థాలను (C&D Waste) అక్రమంగా డంపింగ్‌ చేయకుండా నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరి చేస్తూ GO 841 జారీ చేసినట్లు సమాచారం.

ఇకపై GHMC, CMC, MMC, HMDA పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలోనే నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను సమర్పించాల్సి ఉంటుంది.

నిర్మాణ సమయంలో వెలువడే వ్యర్థాలను నిర్ణీత నిబంధనల ప్రకారం అధీకృత రీసైక్లర్లు లేదా సంబంధిత అనుమతులు కలిగిన సంస్థల ద్వారా మాత్రమే తరలించి డిస్పోజ్‌ చేయాల్సి ఉంటుంది. నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించేలా అధికారులు పర్యవేక్షించనున్నారు.

అంతేకాకుండా భవనం పూర్తయిన అనంతరం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ (OC) పొందే ముందు నిర్మాణ వ్యర్థాలను నిబంధనల ప్రకారం డిస్పోజ్‌ చేసినట్లు ధ్రువీకరించే డిస్పోజల్‌ సర్టిఫికేట్‌ సమర్పించడం తప్పనిసరి కానుంది.

ఈ నిబంధనల ద్వారా రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, ఇతర ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా పడేయడాన్ని అరికట్టడంతో పాటు వాటి రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.