BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 06 April 2026, 07:48 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

నల్గొండలో 11వ తేదీన జరిగే ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం పోస్టర్ విడుదల

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
06 Apr, 2026 - 07:48 PM
144 వీక్షణలు

నల్గొండలో 11వ తేదీన జరిగే ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం పోస్టర్ విడుదల చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

నల్గొండలో ఆవిష్కర్తలకు అండగా ఏప్రిల్ 11న 'ఇన్నోవేషన్ పంచాయత్' కార్యక్రమం చేయనున్న తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TGIC)!

తెలంగాణ – ఏప్రిల్ 6, 2026 – యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రతిభను ప్రోత్సహించడానికి మరియు స్థానిక ఆవిష్కర్తలకు అండగా నిలవడానికి తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TGIC) జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు.నల్గొండ, సూర్యాపేట మరియు యాదాద్రి జిల్లాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు మరియు స్టార్టప్ వ్యవస్థాపకులను తమ విజయవంతమైన కార్యక్రమం ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ ప్రాంతీయ ఎడిషన్‌కు TGIC ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమం 11 ఏప్రిల్, 2026 ఉదయం 10 గంటలకు నల్గొండలోని ఐటీ టవర్ (IT Tower) లో ప్రారంభమవుతుంది. ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమం ఆవిష్కర్తలకు, వారికి అవసరమైన తోడ్పాటుకు మధ్య ఉన్న భౌగోళిక దూరాన్ని తగ్గించడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన వేదిక. తమ ఆలోచన, ఆవిష్కరణ  లేదా పారిశ్రామిక ప్రయాణం గురించి సందేహాలు ఉన్న ఏ వ్యక్తికైనా, రాష్ట్రంలోని వ్యవస్థాపక నిపుణుల నుండి వ్యక్తిగత, మార్గదర్శకత్వం మరియు సలహాలు పొందేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్న వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలకు వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా, తక్షణ మరియు స్పష్టమైన సహాయాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాము. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు, నిపుణులతో నేరుగా చర్చించవచ్చు. వ్యాపారం లేదా సాంకేతిక సవాళ్లను అక్కడికక్కడే (on-the-spot) పరిష్కరించడానికి మార్గదర్శకత్వం, ఆలోచన ధ్రువీకరణ (idea validation), నమూనా అభివృద్ధి (prototype development), వ్యాపారాన్ని విస్తరించే (scaling) ప్రక్రియపై సలహాలు, మరియు ప్రభుత్వ కార్యక్రమాలు, ఇంక్యుబేషన్ సహాయాన్ని నేరుగా పొందడానికి కనెక్షన్‌లను సులభతరం చేసే అవకాశం ఉంటుంది.అంకురాలకు మద్దతుగా, సమ్మిళిత వాతావరణాన్ని నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం బలపరుస్తుంది. కాబట్టి, ఈ జిల్లాల నుండి వచ్చిన ఆవిష్కర్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని కోరుతున్నాము. కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు, ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోండి.

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ గురించి

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ విభాగం ద్వారా స్థాపించబడిన ఒక చొరవ. స్టేట్ ఇన్నోవేషన్ పాలసీ కింద 2017లో రూపొందించబడిన  తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ రాష్ట్రంలో ఆవిష్కరణలను ప్రోత్సహించి, వాటిని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో కీలక పాత్రధారులుగా ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు మరియు ఆవిష్కరణ ఉత్ప్రేరకాలుగా ప్రాధాన్యతనిచ్చే సమగ్ర విధానంతో విభిన్నమైన ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థకు మద్దతునిస్తుంది.