తిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి నల్లమోలు శ్రీనివాసరావు నామినేషన్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
పట్టణ మార్పు కోసం నన్ను ఆశీర్వదించండి: నల్లమోలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నల్లమోలు శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న ఆయన, అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన నల్లమోలు శ్రీనివాసరావు తిరువూరు పట్టణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి, మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదిస్తారనే ధీమాను వ్యక్తం చేశారు.