బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం
నియామక ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్
యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: నాంపల్లి సతీష్
నల్గొండ: జిల్లా పరిధిలోని నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి సతీష్ను భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జిల్లా అధికారిగా నియమించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్ ఈ నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నాంపల్లి సతీష్కు శుభాకాంక్షలు తెలిపారు.
యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు సూచించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
తన నియామకంపై నాంపల్లి సతీష్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. యువతను సంఘటితం చేసి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
తన నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రెడ్ల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్, నాంపల్లి బీజేపీ అధ్యక్షుడు దాచేపల్లి నరసింహతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.