BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 16 October 2026, 07:37 pm
Posted by : VALLAPU KOTESH

బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / నాంపల్లి
Reporter
Vallapu Kotesh Nampally Mandal
16 Oct, 2026 - 07:37 PM
11 వీక్షణలు

నాంపల్లి: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి పట్టణానికి చెందిన నాంపల్లి శివ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

యువతను రాజకీయాల్లో చురుకుగా భాగస్వాములను చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నాంపల్లి శివ మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి యువతను సంఘటితం చేస్తూ నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో మండలవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు.

తన ఎన్నికకు సహకరించిన బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రెడ్ల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు దాచేపల్లి నరసింహతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.