BREAKING
thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం
Date of Publish : 21 October 2026, 12:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసింహారావుపాలెం–సి.గుడిపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా కోట విజయమ్మ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 12:59 PM
21 వీక్షణలు

చాట్రాయి: ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని నరసింహారావుపాలెం–సి.గుడిపాడు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోట విజయమ్మ పేరును ఖరారు చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు పుచ్చకాయల సుబ్బారెడ్డి వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున ఆమె పోటీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పుచ్చకాయల సుబ్బారెడ్డి మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం కోట విజయమ్మ పేరును ఎంపీటీసీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా పార్టీ అభ్యర్థులు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. నరసింహారావుపాలెం, సి.గుడిపాడు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. కోట విజయమ్మ అభ్యర్థిత్వానికి సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.