BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 11:10 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
02 Sep, 2026 - 11:10 PM
47 వీక్షణలు

నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం  

జిల్లాలో బుధవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ(JNTUK) యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థులకు గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం రూ.70 కోట్ల వ్యయంతో 1,600 మంది విద్యార్థినీ, విద్యార్థులకు అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన వసతి గృహాలను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం హాస్టల్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ వి.సంజనా సిమ్హా, జేఎన్ టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.