విజయవాడలో జాతీయ సరస్ మేళా–2026..
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఒకే వేదికపై రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రి
మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ప్రోత్సాహం.. గ్రామీణ మహిళల ప్రతిభ, హస్తకళలు, స్వయం ఉపాధికి జాతీయ స్థాయి వేదికగా సరస్ మేళా
విజయవాడ: జాతీయ సరస్ మేళా–2026కు విజయవాడ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించడం, వారి నైపుణ్యాలను ప్రోత్సహించడం, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశాలు కల్పించడం వంటి లక్ష్యాలతో నిర్వహించే సరస్ మేళా ప్రాధాన్యం సంతరించుకుంది.