BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 08:02 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

చదళ్లలో వైభవంగా చౌడేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Oct, 2026 - 08:02 PM
7 వీక్షణలు

శ్రీ చాముండేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.. జబర్దస్త్ కళాకారుల హాస్య ప్రదర్శన

పుంగనూరు (ఎన్ టుడే న్యూస్): అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చదళ్ల గ్రామంలో శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు గురువారం శ్రీ చాముండేశ్వరి దేవి రూపంలో కొలువుదీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

త్రిశూలం ధరించి దుష్టశక్తులను సంహరించే శక్తి స్వరూపిణిగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ చాముండి స్తోత్ర పారాయణం నిర్వహించారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఆలయ ధర్మకర్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హాస్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జబర్దస్త్ కళాకారులు వినోద్, ఆనంద్, శాంతి స్వరూప్, రాజమౌళి తమదైన శైలిలో పంచ్ డైలాగులు, హాస్యభరితమైన స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు వినోదాన్ని పంచిన ఈ కార్యక్రమం ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఎన్వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.