ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ టికెట్ కోసం నవ్య మద్దతు సమీకరణ
ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, ప్రగడవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి నివాసం వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్య ఎన్డీయే కూటమి నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్డీయే కూటమి తరఫున తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా చింతలపూడి మండలంతో పాటు ప్రగడవరం గ్రామానికి చెందిన ఎన్డీయే నాయకులు, కార్యకర్తలను కలిసిన నవ్య.. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా తనకు మద్దతు తెలిపి, అభ్యర్థిత్వానికి ఆమోదం అందించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి నాయకుల సహకారంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఆమె ఈ భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు తమకు అనుకూలంగా నాయకుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నవ్య ప్రగడవరం వేదికగా చింతలపూడి మండల ఎన్డీయే నాయకులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రగడవరం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.