నెమలి వేణుగోపాల స్వామి ఆలయానికి రూ.24.19 లక్షల హుండీ ఆదాయం
- నెమలి వేణుగోపాల స్వామి ఆలయానికి రూ.24.19 లక్షల హుండీ ఆదాయం
- బంగారం 700 మిల్లీగ్రాములు, వెండి 500.1 గ్రాముల కానుకలు
నెమలి (ఎన్ టుడే న్యూస్): ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ లెక్కింపులో ఆలయంలోని ఏడు హుండీల ద్వారా రూ.23,66,053 ఆదాయం లభించగా, అన్నదానం హుండీ ద్వారా రూ.53,301 సమకూరింది. దీంతో మొత్తం నగదు ఆదాయం రూ.24,19,354గా నమోదైంది.
నగదు కానుకలతో పాటు భక్తులు సమర్పించిన 700 మిల్లీగ్రాముల బంగారం, 500.1 గ్రాముల వెండి కానుకలు కూడా లభించాయి.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎన్. సాంబశివరావు, దేవాలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఎన్. సంధ్య పాల్గొన్నారు. నందిగామ అంబరుపేటలోని శ్రీ సత్యమ్మ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి.వి.కె. సీతారావమ్మ, నందిగామ శ్రీ సీతారామస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్. నరసింహమూర్తి కూడా హాజరయ్యారు.
అలాగే రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బందితో పాటు సత్యసాయి సేవా సమితి సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. అధికారుల పర్యవేక్షణలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు.