పుట్టగానే రాజసం చూపించిన బుడ్డోడు.. బేబీ కింగ్ అంటూ నెటిజన్ల కామెంట్లు!
కాలు మీద కాలు వేసుకుని, తల కింద చేతులు పెట్టుకుని పడుకున్న నవజాత శిశువు ఫొటో వైరల్
పిల్లలు పుట్టగానే ఏడవడం సాధారణం. అయితే ఓ నవజాత శిశువు మాత్రం అందుకు భిన్నంగా ప్రశాంతంగా పడుకుని అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అమ్మ కడుపు నుంచి ఇప్పుడే బయటకు వచ్చా.. కాసేపు విశ్రాంతి తీసుకుంటా అన్నట్లుగా కాలు మీద కాలు వేసుకుని, తల కింద చేతులు పెట్టుకుని పెద్దమనిషిలా పోజు ఇచ్చాడు.
ఈ ముద్దులొలికే శిశువు ఫొటోను ఈజిప్ట్ రాజధాని కైరోకు చెందిన డాక్టర్ ఇస్లాం వెల్లడే ఎల్ డే తీశారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ ఫొటో విస్తృతంగా వైరల్ అవుతోంది. శిశువు ప్రత్యేకమైన భంగిమను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారి హావభావాలు, రిలాక్స్‌గా పడుకున్న తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో పలువురు అతడిని ముద్దుగా ‘బేబీ కింగ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుట్టిన వెంటనే రాజసం ప్రదర్శిస్తున్నాడంటూ సరదాగా స్పందిస్తున్నారు.
చిన్నారి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.