గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా నూతన వస్త్రాలు పంపిణీ..
తెలంగాణ
/
నిజామాబాద్
/
ఆర్మూర్
సిబ్బంది సేవలను గుర్తించి పండుగ కానుకలు అందించిన అన్నారం సర్పంచ్ సంజీవ్ ..
డొంకేశ్వ ర్: దసరా పండుగను పురస్కరించుకుని అన్నారం గ్రామ సర్పంచ్ అట్టోలి సంజీవ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను దసరా కానుకగా అందజేశారు. పండుగ వేళ సిబ్బందిలో ఆనందాన్ని నింపుతూ, వారి సేవలను గుర్తించి వస్త్రాలు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ సంజీవ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వారి కృషి ఎంతో ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.