నూజివీడులో కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందడి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం సందడిగా సాగింది. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఇళయరాజాతో పాటు కూటమి నాయకులు నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో నూజివీడులో రాజకీయ సందడి నెలకొంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.