BREAKING
thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం!
మంచి మాట
Date of Publish : 23 October 2026, 07:00 pm
Posted by : SHAIK CHAND BASHA

యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
23 Oct, 2026 - 07:00 PM
13 వీక్షణలు
  • యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం
  • ఆధునిక సాగు పద్ధతులతోనే అధిక దిగుబడులు
  • అసోసియేట్ డీన్ డా. బి. సహదేవ రెడ్డి

యర్రిపల్లి (ఎన్‌ టుడే న్యూస్‌): విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) కీలక పాత్ర పోషిస్తుందని పులివెందుల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. బి. సహదేవ రెడ్డి పేర్కొన్నారు.

గురువారం పులివెందుల మండలం యర్రిపల్లి గ్రామంలో పులివెందుల వ్యవసాయ కళాశాల తుది సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. సహదేవ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు గ్రామీణ ప్రాంత ప్రజలతో మమేకమై, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. గ్రామీణ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం రైతులు, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించడంతో పాటు రైతులు మెరుగైన ఆదాయం పొందవచ్చని వివరించారు. మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ డా. ప్రసన్న రాజేష్, అసోసియేట్ ప్రొఫెసర్ డా. రవి బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. సి. ప్రత్యూష, డా. నారాయణ స్వామి పాల్గొన్నారు. వారు వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై రైతులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.