BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 15 October 2026, 03:31 pm
Posted by : V శ్రీనివాస్

​జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చి యూనిక్ కోడ్ కేటాయించాలి

తెలంగాణ
/ తెలంగాణ / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Oct, 2026 - 03:31 PM
11 వీక్షణలు

జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్

​కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీసీ కార్నర్‌లో నిరసన ప్రదర్శన

​మంచిర్యాల :కేంద్ర ప్రభుత్వం రాబోయే జనగణనలో వెంటనే ఓబీసీ కాలమ్‌ను చేర్చి, ప్రతి కులానికి ఒక యూనిట్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీసీ కార్నర్‌లో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్రిటిష్ హయాంలో 1931లో చేపట్టిన కులగణన తర్వాత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 ఏళ్లు గడుస్తున్నా నేటికీ బీసీ కులగణన చేపట్టకపోవడం ముమ్మాటికీ బీసీలపై వివక్ష చూపడమేనని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సాగిన పోరాటాల ఫలితంగానే ఇప్పటికే 10 రాష్ట్రాల అసెంబ్లీలు కులగణనపై తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయని గుర్తుచేశారు. పార్లమెంటులో కులగణన చేపడతామని చెప్పిన ప్రధాని మోడీ ఇప్పుడు మాట తప్పడం శోచనీయమని, జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టకపోవడం అంటే బీసీలను తీవ్రంగా మోసం చేయడమేనని మండిపడ్డారు. కులగణన చేపడితే చట్టసభల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని, విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే దురుద్దేశంతోనే కేంద్ర పాలకులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ఓబీసీ కాలమ్ సాధించేవరకు ఉద్యమం ఆగదు

​బీసీల ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రధాన ప్రతిపక్షమైన ‘ఇండియా’ కూటమి కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని నాయకులు కోరారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచి జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చి కులానికి ఒక కోడ్ కేటాయించాలని, లేనిపక్షంలో యావత్ బీసీ సమాజం ముందు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టి దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. జనగణనలో ఓబీసీ కాలమ్ సాధించేవరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కంచర్ల సదానందం, నాయకులు అశోక వేముల, పెద్దల చంద్రకాంత్, దేవస్థాన నాగరాజ్, ఎండీ లతీఫ్, తంగళ్ళపల్లి బాపు, వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.