BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 19 October 2026, 08:31 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో సీపీఐ అభ్యర్థి నామినేషన్‌కు అడ్డంకులు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Oct, 2026 - 08:31 AM
1 వీక్షణలు
  • కూటమి నేతలు అడ్డుకున్నారని సీపీఐ నాయకుల ఆరోపణ
  • రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సీపీఐ నేతలు
  • రోడ్డుపై బైఠాయించి నిరసన
    సీపీఐ, ఎస్డీపీఐ నుంచి ఒక్కొక్క నామినేషన్

పుంగనూరు, అన్నమయ్య జిల్లా: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సీపీఐ తరఫున దిన్నెపల్లి చందు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లగా, కూటమి నాయకులు అడ్డుకున్నారని సీపీఐ నేతలు ఆరోపించారు.

సీపీఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మహేష్, పుంగనూరు పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ టి. జనార్దన్ నేతృత్వంలో పార్టీ నాయకులు మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన అధికార పార్టీ నాయకులు తమను అడ్డుకున్నారని వారు తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొంతసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బయట ప్రాంతాల నుంచి వచ్చిన అధికార పార్టీ కార్యకర్తలు సీపీఐ నేతలపైకి దూసుకొచ్చారని వారు ఆరోపించారు. తోపులాటతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తమను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సీపీఐ నాయకులు మహేష్, జనార్దన్, కృష్ణప్ప, సాంబశివ, మురళి, రామ్మూర్తి, మున్నా తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని సీపీఐ నాయకులు విమర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సీపీఐ నేతలు ప్రయత్నిస్తుండగా, ఒక నామినేషన్‌కు అనుమతి ఇస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో ముగ్గురు నాయకులను నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు. అనంతరం కట్టుదిట్టమైన నిబంధనల మధ్య నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.

ప్రతిపక్ష పార్టీలను, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, చివరకు సీపీఐ నుంచి ఒకరు, ఎస్డీపీఐ నుంచి ఒకరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగలిగారని సమాచారం.

ఈ ఘటనపై అధికార పార్టీ నాయకులు, పోలీసుల అధికారిక వివరణ తెలియాల్సి ఉంది.