BREAKING
thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం
మంచి మాట
Date of Publish : 23 October 2026, 03:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరంలో పానుగంటి రజిని నామినేషన్‌కు భారీ స్పందన!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Oct, 2026 - 03:46 PM
145 వీక్షణలు
  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి.. మద్దతుగా కదిలిన 1,500 మంది
  • కులమతాలకు అతీతంగా మద్దతు తెలిపిన నాయకులు, కార్యకర్తలు, యువత

ఏలూరు జిల్లా | నూజివీడు నియోజకవర్గం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పానుగంటి సూరిబాబు సతీమణి పానుగంటి రజిని నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో సుమారు 1,500 మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పోలవరం గ్రామానికి చెందిన పానుగంటి రజిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరిడి అప్పారావు, చాగంటి బుచ్చిబాబు, ఎర్ర చిన్నయ్య, చాగంటి నరసింహారావు ఆమెకు మద్దతు ప్రకటించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో ర్యాలీ కొనసాగగా, నామినేషన్ కార్యక్రమానికి స్థానికులు తరలివచ్చారు. వివిధ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువత కులమత భేదాలకు అతీతంగా మద్దతు ప్రకటించడం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

అనంతరం పానుగంటి రజిని ఎంపీటీసీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సీనియర్ నాయకుల మద్దతు, ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్యతో పోలవరం గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది.

స్వతంత్ర అభ్యర్థిగా పానుగంటి రజిని ఎన్నికల బరిలో నిలవడంతో పోలవరం గ్రామంలో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.