నిబంధనలకు విరుద్ధంగా టిఫిన్ సెంటర్ నిర్వహణ.. యజమానికి రెండు రోజుల జైలు
నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
హైదరాబాద్, అక్టోబర్ 23: నిబంధనలకు విరుద్ధంగా టిఫిన్ సెంటర్ నిర్వహించిన కేసులో మహమ్మద్ హబీబుల్లా ఖాన్ (52)కు నాంపల్లిలోని రెండో తరగతి ప్రత్యేక న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది.
హైదరాబాద్‌లోని మలక్‌పేట పల్టాన్ ప్రాంతంలో టిఫిన్ సెంటర్ నిర్వహణకు సంబంధించి చాదర్‌ఘాట్ పోలీసులు హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 21/76 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి టి. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు.
ఈ కేసు ఎస్‌టీసీ నంబర్ 4472/2026గా నమోదైంది. ఎస్‌ఐ ఎం. సురేష్ రెడ్డి దర్యాప్తు నిర్వహించగా, కానిస్టేబుల్ జి. సాయినాథ్ (పీసీ 1586) కేసు ప్రక్రియలో పాల్గొన్నారు.
మలక్‌పేట డివిజన్, చార్మినార్ జోన్ పరిధిలో నిబంధనల అమలుకు సంబంధించి పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు.