అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అలయ్ బలయ్ వేడుకలు
సోదరభావం, సామాజిక ఐక్యతను చాటిచెప్పిన కార్యక్రమం
హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, సామాజిక ఐక్యతను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
రాజకీయాలకు అతీతంగా ఆత్మీయతకు వేదిక
రాజకీయాలకు అతీతంగా ప్రజల మధ్య ఆత్మీయతను పెంపొందించడం, పరస్పర స్నేహభావాన్ని చాటిచెప్పడం అలయ్ బలయ్ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలు సామాజిక ఐక్యతకు వేదికగా నిలిచాయి.