BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 15 October 2026, 02:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Oct, 2026 - 02:57 PM
30 వీక్షణలు

యువతకు స్ఫూర్తిప్రదాత అబ్దుల్ కలాం – శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు నారాయణరావు ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 15: తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నత పదవిని అలంకరించినప్పటికీ నిరాడంబరమైన జీవితాన్ని గడిపి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అగ్ని, పృథ్వీ క్షిపణుల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి దేశానికి విశేష గుర్తింపు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. యువతలో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందిస్తూ, కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలని సందేశమిచ్చిన గొప్ప శాస్త్రవేత్త, మార్గదర్శి అబ్దుల్ కలాం అని కొనియాడారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కలాం చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇనపనూరి బాబు, మోటపోతుల అంజయ్య, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.