మిర్తివలస ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన తరఫున పైడి గోవిందరావు నామినేషన్
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అభ్యర్థి వెల్లడి
నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులు
సంతకవిటి, విజయనగరం జిల్లా | ఎన్ టుడే న్యూస్: సంతకవిటి మండలం మిర్తివలస గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పైడి గోవిందరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి పైడి గోవిందరావు అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు హాజరయ్యారు.