ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
పార్టీకి అందించిన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించిన కార్యకర్తలు
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 19: భువనగిరి మండలం ఆకుతోట భావి తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ధరావత్ పాండు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లంల జంగయ్య యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పాండు నాయక్ పార్టీకి అందించిన సేవలను గుర్తించిన గ్రామ పార్టీ కార్యకర్తలు ఆయనను గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారని జంగయ్య యాదవ్ పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన పాండు నాయక్‌ను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు చిక్కుల వెంకటేష్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు చుక్కస్వామి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుగులోతు లచ్చిరాం, మురళి నాయక్, బాబురావు, రమేష్, నానం కృష్ణ, కేతావత్ రాజు నాయక్, లకావత్ సురేష్, కేతావత్ పాండు, మచ్చ నవీన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.