BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 05:53 pm
Posted by : DAVU RAVINDER REDDY

పోలీస్ నోటిఫికేషన్‌పై హైదరాబాద్ అభ్యర్థుల ఆందోళన

తెలంగాణ
/ హైదరాబాద్
01 Sep, 2026 - 05:53 PM
61 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఖాళీలపై స్పష్టత లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

మూడు కమిషనరేట్ల పరిధిలో ఎన్ని కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి? ఆయా పోస్టులకు సంబంధించి రిక్రూట్‌మెంట్ ఎలా నిర్వహిస్తారు? అనే అంశాలపై TSLPRB స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని పోస్టులపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. దరఖాస్తుల గడువు ముగిసేలోగా ఖాళీల వివరాలు వెల్లడించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

TSLPRB ఛైర్మన్ ఈ అంశంపై అధికారిక ప్రకటన విడుదల చేసి అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.