BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 05:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 05:21 PM
160 వీక్షణలు

పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు: 100 లీటర్ల బెల్లపు ఊట నాశనం

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ బి. శ్రీలత, ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కే. నాగప్రభు కుమార్, ఏలూరు జిల్లా డిస్టిక్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ ఎ. అవులయ్య ఆదేశాల మేరకు నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన కార్యక్రమం నవోదయం 2.0లో భాగంగా చాట్రాయి మండలం పోతనపల్లి పెద్దతండా గ్రామంలో దాడులు చేసి సారా తయారికి సిద్ధంగా ఉంచిన 100 లీటర్ల బెల్లపు ఊటను నాశనం చేసి, 02 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చాట్రాయి మండలం పోతనపల్లి చిన్నతండా గ్రామానికి చెందిన బనవతు హంస్లి భర్త బద్దు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు. అలాగే, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారు నాటు సారా తయారీకి సప్లై చేసే బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ 9440902462కు సమాచారం ఇవ్వాలని కోరారు.