BREAKING
thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు
Date of Publish : 16 October 2026, 06:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజాసేవే లక్ష్యంగా చాట్రాయి జడ్పీటీసీ బరిలో దిగేందుకు దార్ల వినోద్ కుమార్ సిద్ధం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Oct, 2026 - 06:11 PM
200 వీక్షణలు

వైసీపీ అధిష్ఠానం అవకాశం కల్పిస్తే పోటీకి సై

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి: ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని, వైసీపీ అధిష్ఠానం అవకాశం కల్పిస్తే చాట్రాయి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని దార్ల వినోద్ కుమార్ తెలిపారు.ఏలూరు జిల్లా డాక్టర్స్ వింగ్ లో సెక్రటరీ గా వుంటూ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహణ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడంతోపాటు, వైసీపీ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో అనేకసార్లు పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో డయాగ్నస్టిక్ సేవల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ, తనకు చేతనైనంతవరకు పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో సూరంపాలెం గ్రామంలో ప్రజలకు కూరగాయలు పంపిణీ చేసి తన వంతు సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గుర్తుచేశారు. అంతేకాకుండా, ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నానని తెలిపారు. చాట్రాయి మండలంలో జడ్పీటీసీ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించిన నేపథ్యంలో, పార్టీ అధిష్ఠానం తనకు అవకాశం కల్పిస్తే ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని దార్ల వినోద్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూనే, ప్రజలకు మరింత చేరువగా ఉండి సేవ చేయాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు.