BREAKING
thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు
Date of Publish : 16 October 2026, 05:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు.. మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Oct, 2026 - 05:18 PM
13 వీక్షణలు

ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

వైసీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్

ఎన్టీఆర్ జిల్లా: రాయచోటిలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు వెళ్తున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగిన దాడిని వైసీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులపై దాడులకు ఎలాంటి తావులేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని పేర్కొంటూ, జెడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన ప్రజాప్రతినిధిపై దాడి జరగడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి భయాందోళనలకు తావులేకుండా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పరిష్కరించుకోవాలని, దాడులు, బెదిరింపుల ద్వారా రాజకీయాలను ప్రభావితం చేయాలనుకోవడం సరైన విధానం కాదని అన్నారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి, దాడికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నల్లగట్ల స్వామిదాస్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల సమయంలో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రజాప్రతినిధులు తమ విధులను నిర్భయంగా నిర్వహించే వాతావరణాన్ని కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.