BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 July 2026, 07:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పవన్ మాస్టర్ ప్లాన్.. స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 07:48 PM
115 వీక్షణలు

పవన్ మాస్టర్ ప్లాన్.. స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ దృష్టి సారించింది. ఈ ఎన్నికలను పార్టీ బలోపేతానికి కీలక అవకాశంగా మలుచుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో గణనీయమైన విజయాలు సాధించి గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచాలని జనసేన లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి విజయాలు నమోదు చేసిన జనసేన.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా తన ప్రభావాన్ని చాటాలని భావిస్తోంది. పార్టీకి బలమైన కేడర్ ఉన్న ప్రాంతాల్లో రాజీ పడకుండా ఎక్కువ స్థానాలు దక్కించుకునే దిశగా వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కూటమి భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తూనే, జనసేనకు బలమైన పట్టున్న నియోజకవర్గాలు, గ్రామాలు, పట్టణాల్లో అధిక ప్రాధాన్యం దక్కేలా పార్టీ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.