BREAKING
thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
Date of Publish : 19 October 2026, 08:01 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
19 Oct, 2026 - 08:01 PM
6 వీక్షణలు

అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ హనుమంతరావు

రొంపిచర్ల: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ ఎం. హనుమంతరావు కోరారు. ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సోమవారం రొంపిచర్ల మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్డ్ సెర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలోని వివిధ బజార్లు, వీధుల్లో ఇంటింటి సోదాలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి, లైసెన్స్ లేని వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అవసరమైన పత్రాలు లేని వాహనదారుల నుంచి జరిమానాలు వసూలు చేసి, నిబంధనల ప్రకారం వాహనాలను తిరిగి అప్పగించారు.

అనంతరం అదనపు ఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసు శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా, మద్యం సేవించి గొడవలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై బైండోవర్ చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైన సందర్భాల్లో రౌడీషీట్లు తెరుస్తామని స్పష్టం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన కొందరిని గుర్తించి వారిపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.