BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 01:44 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌లో నిర్మాణాల కోసం కొత్త బోర్లకు అనుమతులు బంద్‌!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Oct, 2026 - 01:44 PM
17 వీక్షణలు
  • తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం
  • నిర్మాణాలకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా
  • నీటి సంరక్షణపై దృష్టి

ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వ అప్రమత్తత.. తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం

హైదరాబాద్, అక్టోబర్ 21: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి లభ్యతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నగరంలో నిర్మాణాల కోసం కొత్త బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వకూడదని అధికారులను ఆదేశించింది. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించేలా చర్యలు చేపడుతోంది.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌లో నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం కొత్త బోర్లు తవ్వేందుకు అనుమతులు ఇవ్వకూడదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న బోర్లను తాగునీటి అవసరాల కోసం లోతు పెంచేందుకు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలని సూచించారు. నగరంలో నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనులకు అవసరమైన నీటిని భూగర్భ జలాల నుంచి అధికంగా వినియోగించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్‌ 1 నుంచి మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన నీటిని గ్రీన్‌ వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నిర్మాణ ప్రాంతాలకు సరఫరా చేసే ఏర్పాట్లు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాబోయే నెలల్లో నీటి కొరత తలెత్తకుండా మండల స్థాయి వరకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. భూగర్భ జలాల పరిస్థితిని పర్యవేక్షిస్తూ తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించడం, వృథాను తగ్గించడం ద్వారా వేసవి అవసరాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.