BREAKING
thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు
మంచి మాట
Date of Publish : 25 October 2026, 08:30 am
Posted by : కూనురు మధు

అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుంది -- ఎస్పీ శరత్ చంద్ర పవార్

తెలంగాణ
/ నల్గొండ
25 Oct, 2026 - 08:30 AM
4 వీక్షణలు

1994లో నక్సలైట్ల దాడిలో అమరుడైన ఎస్‌ఐ లక్ష్మయ్య కుటుంబానికి ఎస్పీ పరామర్శ

NTODAY NEWS :  నల్గొండ 

పోలీస్ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ భరోసా ఇచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 1994లో నక్సలైట్ల దాడిలో అమరుడైన ఎస్‌ఐ లక్ష్మయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఇప్పటివరకు 15 మంది పోలీసు సిబ్బంది అమరులయ్యారని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. వారి సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, వారికి అండగా నిలుస్తామని ఎస్పీ స్పష్టం చేశారు