BREAKING
thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 11:37 am
Posted by : NAGARAJU GADE

విద్యుత్‌ శాఖ ఏఈ లలిత కుమారి అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
26 Oct, 2026 - 11:37 AM
11 వీక్షణలు

కొండంపేట శ్మశాన వాటిక సమీపంలో రక్తపు మడుగులో మృతదేహం

హత్య కోణంలో దర్యాప్తు: డీఎస్పీ రాఘవులు

విజయనగరం | ఎన్ టుడే న్యూస్‌: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ)గా పనిచేస్తున్న గుడివాడ లలిత కుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాజాం మండలం కొండంపేట శ్మశాన వాటిక సమీపంలో ఆమె మృతదేహం రక్తపు మడుగులో లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

యోగా సెంటర్‌కు వెళ్తుండగా ఘటన

లలిత కుమారి వేకువజామున స్కూటీపై యోగా సెంటర్‌కు వెళ్లినట్లు సమాచారం. కొండంపేట శ్మశాన వాటిక సమీపంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తలపై తీవ్ర గాయాలు.. పోలీసుల దర్యాప్తు

లలిత కుమారి తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసును హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రాఘవులు వెల్లడించారు.

లలిత కుమారి మృతికి గల కారణాలు, ఘటన వెనుక ఉన్న పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.