రాజమండ్రిలో ఘనంగా ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు
అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. కేక్ కట్ చేసిన చందన నాగేశ్వర్
రాజమండ్రి, ఎన్ టుడే న్యూస్: రెబల్ స్టార్ కృష్ణంరాజు, నటుడు ప్రభాస్ అభిమానుల సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలోని సంహిత కాలేజీలో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పచ్చదనం, సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) చందన నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని చందన నాగేశ్వర్ సందర్శించారు. అనంతరం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజును సామాజిక సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ ఫ్యాన్స్ సేవా సమితి రాజమండ్రి సిటీ అధ్యక్షుడు సుబ్బు, ప్రెసిడెంట్ జి. కిషోర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్. చందు రెడ్డి, సెక్రటరీ సీహెచ్. సతీష్, జనరల్ సెక్రటరీ వి. సాయి తదితరులు పాల్గొన్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.