తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
NTODAY NEWS :చిట్యాల
తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డిని చిట్యాల పోలీసులు ఆదివారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు జోగు లింగస్వామిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంద వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి కారణం లేకుండా ముందస్తు అరెస్టులు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాస ముట్టడికి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని అన్నారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలని హెచ్చరించారు.