గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత
వెల్లంకిలో సిబ్బందికి దుస్తులు, ఇతర వస్తువులు పంపిణీ చేసిన సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి: రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ దుస్తులు, ఇతర వస్తువులను అందజేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున ఈ కానుకలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీటి సరఫరా వంటి సేవల్లో గ్రామపంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. గ్రామ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న సిబ్బంది కృషి అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, జువ్వగోని మల్లమ్మ, మిర్యాల జగన్, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.