BREAKING
thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం
Date of Publish : 19 October 2026, 08:19 pm
Posted by : KOLA MAHESH

గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
19 Oct, 2026 - 08:19 PM
2 వీక్షణలు

తండ్రి జ్ఞాపకార్థం ఏటా సిబ్బందికి ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 19: సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామానికి చెందిన మర్రిగూడ తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు తన తండ్రి స్వర్గీయ జక్కర్తి సాయిలు జ్ఞాపకార్థం ఏటా దసరా పండుగ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

ఈ ఏడాది కూడా గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న 11 మంది సిబ్బందికి కొత్త దుస్తులు కొనుగోలు చేసుకునేందుకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.22,000 అందజేశారు. శ్రీనివాసులు తల్లి జక్కర్తి జయమ్మ చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.

తండ్రి జ్ఞాపకార్థం ఏటా గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందిస్తూ వారి పట్ల తన అభిమానాన్ని చాటుకుంటున్న శ్రీనివాసులు సేవలను పలువురు అభినందించారు. పండుగ వేళ సిబ్బందికి ఆర్థికంగా అండగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఆర్థిక సహాయం అందుకున్న సిబ్బంది: మెరుగు యాదయ్య (కారోబార్), దర్శనం చంద్రయ్య, దుబ్బాక నర్సింహా (వాటర్‌మెన్లు), దుబ్బాక సైదమ్మ, దర్శనం లక్ష్మయ్య, గుండెపంగ బుచ్చమ్మ, ఒంటేపాక పార్వతమ్మ (పారిశుద్ధ్య సిబ్బంది), కాసోజు వెంకటాచారి (ఎలక్ట్రీషియన్), అయితరాజు నరేందర్ (ట్రాక్టర్ డ్రైవర్), బండ లింగస్వామి (మిషన్ భగీరథ వాటర్‌మెన్), గుండెపంగ లక్ష్మయ్య (మిషన్ భగీరథ లైన్‌మెన్).