BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 15 October 2026, 03:35 pm
Posted by : V శ్రీనివాస్

సింగరేణి లాభాల్లో విశ్రాంత ఉద్యోగులకు వాటా ప్రకటించాలని నిరసన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Oct, 2026 - 03:35 PM
15 వీక్షణలు

నల్లగంతలు కట్టుకుని విశ్రాంత కార్మికుల ఆందోళన

మంచిర్యాల: 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో విశ్రాంత ఉద్యోగులకు వాటా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. నాయకులు, విశ్రాంత ఉద్యోగులు కళ్లకు నల్లగంతలు కట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. 30 నుంచి 35 సంవత్సరాల పాటు బొగ్గు గనుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన విశ్రాంత కార్మికుల శ్రమ సింగరేణి సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఒకప్పుడు నష్టాల్లో కూరుకుపోయి బీఐఎఫ్‌ఆర్‌ (BIFR) పరిధికి చేరిన సంస్థను వేల కోట్ల రూపాయల లాభాల బాట పట్టించడంలో కార్మికుల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం కొందరు విశ్రాంత ఉద్యోగులు నెలకు రూ.350 నుంచి రూ.1,000 లోపు బొగ్గు గనుల పెన్షన్‌తో జీవనం సాగిస్తున్నారని వెంకటయ్య తెలిపారు. ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్‌ కంటే తక్కువ మొత్తంతో బతుకుతున్న తమకు లాభాల్లో వాటా ప్రకటిస్తారని ఆశించామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్ణయం తమను నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల్లో వాటా ప్రకటిస్తే బతుకమ్మ, దసరా పండుగలను కుటుంబాలతో సంతోషంగా జరుపుకునే అవకాశం ఉండేదన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తప్పదు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విశ్రాంత ఉద్యోగులకు జరిగిన అన్యాయాల నేపథ్యంలో సింగరేణి పరిధిలోని సుమారు 80 వేల విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలు ఏకమయ్యాయని వెంకటయ్య పేర్కొన్నారు. ప్రస్తుత పాలకులు వారి సమస్యలను విస్మరించకూడదని సూచించారు.

గతంలో ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఆర్‌ఎంఎస్‌ (CPRMS) హెల్త్‌ కార్డు చికిత్స పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అధికారులకు వర్తించే విధంగా విశ్రాంత ఉద్యోగులకు కూడా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య ఖర్చుల సదుపాయం కల్పించాలని కోరారు. సొంత ఇళ్లు లేని విశ్రాంత ఉద్యోగులకు నెహ్రూ హౌసింగ్‌ కాలనీల్లో ఇళ్లు లేదా సంస్థలో ఖాళీగా ఉన్న క్వార్టర్లు కేటాయించాలని, ఏరియా ఆసుపత్రుల్లో పూర్తి ఉచిత వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.

విశ్రాంత ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి కూడా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్యతో పాటు నాయకులు భీంసేన్, భిక్షపతి, రాజేశం, నర్సయ్య, నారాయణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.