BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 September 2026, 12:51 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రేవంత్ రెడ్డికి కొండా సుష్మిత సవాల్

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
04 Sep, 2026 - 12:51 PM
6 వీక్షణలు

వరంగల్ | Ntoday News

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శలు, ప్రతివిమర్శలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుష్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తల్లిపై చర్యలు తీసుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు.

“రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా తల్లికి పోటీగా నిలబడాలి” అంటూ సవాల్ విసిరారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవేనని, వాటికి తన తల్లిపై చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు.

రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతికి సంబంధించిన అంశాలపై తాను మాట్లాడానని, అంతేతప్ప కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్లు భావించకూడదని సుష్మిత పేర్కొన్నారు.

తన తల్లిపై చర్యలు తీసుకున్న తీరును చూసి బాధ కలిగిందని ఆమె అన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని తాను శపిస్తున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, కొండా సుష్మిత చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

– కొండా సుష్మిత