BREAKING
thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్
Date of Publish : 21 October 2026, 02:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీకి వర్ష సూచన.. ఈ నెల 29, 30 తేదీల్లో తుఫాన్ ముప్పు?

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 02:25 PM
23 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నెల 24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 26వ తేదీ తర్వాత అది వాయుగుండంగా బలపడవచ్చని సమాచారం. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటే ఈ నెల 29, 30 తేదీల్లో ఉత్తర కోస్తా ప్రాంతం వైపు తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఉత్తర కోస్తాంధ్రతో పాటు దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అయితే, తుఫాన్ ఏర్పడటం, దాని తీవ్రత, తీరం దాటే ప్రాంతం, సమయం వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భారత వాతావరణ శాఖ తాజా సముద్ర వాతావరణ బులెటిన్ ప్రకారం, అక్టోబర్ 23 ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తుఫాన్‌పై అధికారిక హెచ్చరికల కోసం వాతావరణ శాఖ తాజా సమాచారాన్ని గమనించాలి.