BREAKING
thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు!
Date of Publish : 19 October 2026, 10:07 am
Posted by : THALLAPALLI LAKSHMANA

ఏపీలో ఈ నెల 22 వరకు వర్షాలు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
19 Oct, 2026 - 10:07 AM
13 వీక్షణలు

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. కోస్తాంధ్ర, తమిళనాడు పరిసర బంగాళాఖాతం, కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని, ఉపరితల ద్రోణి కూడా విస్తరించిందని పేర్కొంది. ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, అన్నమయ్య, వైఎస్సార్ కడప, ప్రకాశం నుంచి కాకినాడ వరకు ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.