తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు!
తెలంగాణ
/
హైదరాబాద్
పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన
హైదరాబాద్, అక్టోబర్ 23: బంగాళాఖాతం, అండమాన్ దీవుల పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. వర్షం కురిసే సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ శాఖ జారీ చేసే తాజా సూచనలను గమనించాలని ప్రజలకు సూచించారు.