BREAKING
thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం thumb ● ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి: సీపీఎం డిమాండ్ thumb ● నారాయణపురం మండలానికి కరువు ప్రాంతంగా ప్రకటించాలి thumb ● ఎల్కతుర్తిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం thumb ● ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి: సీపీఎం డిమాండ్ thumb ● నారాయణపురం మండలానికి కరువు ప్రాంతంగా ప్రకటించాలి thumb ● ఎల్కతుర్తిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
Date of Publish : 19 October 2026, 04:33 pm
Posted by : V శ్రీనివాస్

ఏఎస్ఐగా పదోన్నతి పొందిన రాజమణికి ఘన సన్మానం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Oct, 2026 - 04:33 PM
9 వీక్షణలు

లక్ష్మీనగర్ కాలనీలో ఆత్మీయ సమ్మేళనం.. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన స్థానికులు

మంచిర్యాల: పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ ఏఎస్ఐగా పదోన్నతి పొందిన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీకి చెందిన గడిపెల్లి రాజమణిని స్థానికులు ఘనంగా సన్మానించారు. సోమవారం అక్టోబర్ 19న సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, బస్తీ పెద్దలు, మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమెను శాలువాతో సత్కరించి, పూల బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించిన రాజమణి పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ హెడ్ కానిస్టేబుల్‌గా, ప్రస్తుతం ఏఎస్ఐగా పదోన్నతి పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అధికారుల ప్రశంసలు పొందడంతో పాటు ప్రజల మన్ననలు అందుకున్నారని కొనియాడారు. ఆమె కృషి, అంకితభావం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

రాజమణి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఆమె వృత్తి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, నాయకులు గోపతి లక్ష్మణ్, గూడ రాజిరెడ్డి, చిప్ప రామస్వామి, గుజ్జ శంకర్, అడిచర్ల రాజేశం, మామిడాల సత్యనారాయణ, చుంచు పోషన్న, ఎం. రాజయ్య, బిల్ల రాజయ్య, మంచాల రామయ్య, కృష్ణారెడ్డి, నల్లపు రమేష్, సుభాష్ రెడ్డి, రైల్వే ఏఎస్ఐ సురేష్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ అక్కల తిరుపతి, కె. సాంబమూర్తి, ఉపాధ్యాయుడు శ్రీనివాస్, ఆర్ఎంపీ వైద్యుడు వెంకట్ రెడ్డి, కాలనీ పెద్దలు, మహిళలు, సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.