BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 March 2026, 05:34 pm
Posted by : V శ్రీనివాస్

రంగస్థల దినోత్సవం వేళ నటుడు అశోక్ వేములకు అరుదైన గౌరవం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
27 Mar, 2026 - 05:34 PM
196 వీక్షణలు

​రంగస్థల దినోత్సవం వేళ నటుడు అశోక్ వేములకు అరుదైన గౌరవం

ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని అమేజింగ్ స్టార్ అశోక్ వేములకి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేముల అశోక్ కొన్ని సంవత్సరాలుగా చిన్న సినిమాల్లో పెద్ద సినిమాలలో రాణిస్తూ తన ప్రతిభను చాటుకొని జనహృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం జరిగింది. అమేజింగ్ స్టార్ గా గుర్తింపు పొందిన బీసీ ముద్దుబిడ్డ మన వేముల అశోక్ గారు.

​గతములో తాను నిర్మించి నటించిన సినిమాలకి అవార్డులు కూడా రావడం జరిగినది. ఈ మన మంచిర్యాల ముద్దుబిడ్డను సన్మానించడం ఆనందంగా ఉంది. వారు ఇప్పటివరకు 70కి పైగా సినిమాలు, 35 డివోషనల్ జానపద పాటలలో నటిస్తూ ప్రొడ్యూసర్గా ఎన్నో వైవిధ్య భరితమైన జానపద పౌరాణిక సాంఘిక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందిన మహా నటులు. అశోక్ రానున్న రోజుల్లో ప్రజల ఆదరాభిమానాలు మరిన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాము.

రంగస్థల దినోత్సవం వేళ నటుడు అశోక్ వేములకు అరుదైన గౌరవం

​ఈ సందర్భంగా సన్మాన గ్రహీత వేముల అశోక్ గారు మాట్లాడుతూ తన కళకు గుర్తింపు లభించినట్లు భావిస్తూ, సన్మానం జరిపిన బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, కంకణాల సత్యనారాయణ, రాజన్న చారి, చంద్రగిరి చంద్రమౌళి, కీర్తి రవి, చెలిమెల అంజయ్య, మల్లేశం, రామస్వామి తదితరులు పాల్గొన్నారు