BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో తొలి రోజు 7 నామినేషన్లు thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● రొంపిచర్ల మండలంలో తొలి రోజు 7 నామినేషన్లు thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Date of Publish : 31 March 2026, 11:28 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ప్రతి రోజు సూర్య నమస్కారం చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
31 Mar, 2026 - 11:28 AM
251 వీక్షణలు

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రతి రోజూ వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సూర్య నమస్కారాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తాయి. ఈ 12 ఆసనాల‌ని వేయడం వలన విష పదార్థాలు కరిగిపోతాయి. దేహ కదలికలు సులువు అవుతాయి. కీళ్లు వదులు అవడం, నరాల, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేయడం జరుగుతాయి. అలాగే శరీరంలో బిగువులు తొలగిపోతాయి. దృష్టి, వినికిడి, వాసన, రుచి యొక్క శక్తులు పెరుగుతాయి.రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం తేలికగా అవుతుంది. శక్తివంతంగా అవుతుంది. దేహంo వ్యవస్థలన్నీ కూడా మెరుగుపడతాయి. సూర్య నమస్కారాలు చేయడం వలన జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. ఆలోచనలో స్పష్టత వస్తుంది. భావవ్యక్తీకరణలు, ప్రజ్ఞా కలుగుతాయి. సూర్య నమస్కారాలు చేయడం వలన శరీరం ఒకే విధమైన విశ్రాంతిని పొందుతుంది. సూర్య నమస్కారాల‌ని సక్రమంగా చేస్తే ప్రణామ ప్రవాహంగా అవిచ్ఛిన్నంగా సాగుతుంది.మెడ ముందుకి, వెనుకకి, పైకి, కిందకి ప్రధానంగా కదులుతుంది. సూర్య నమస్కారాలు చేస్తుంటే ఏడు ప్రధాన చక్రాలని చైతన్యవంతం చేస్తాయి. మీరు సూర్య నమస్కారాలు చేయాలనుకుంటే కచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వాళ్ళు, చెడు రక్తం, జీర్ణ సమస్యలు కలిగిన వాళ్ళు పవనముక్తాసన శ్రేణి భంగిమను మెల్లగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి s తర్వాత మీరు సూర్య నమస్కారాలు చేస్తూ రావాలి.ఇలా చేయడం వలన ఇబ్బంది ఉండదు. నెమ్మదిగా మీరు సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలలోని కదలికలని అనువుగా శరీర భాగాలు సర్దుకుంటాయి. అలా చేయకపోతే కీళ్ల నొప్పులు, జ్వరం, పాదాల వాపు, చర్మం పగిలిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. జ్వరం, అల్సర్స్ వంటి సమస్యలు వున్నవాళ్లు నమస్కారాలు చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు..