ఒమన్ సముద్ర తీరంలో అరుదైన పింక్ డాల్ఫిన్లు
అంతర్జాతీయం
ఒమన్ రాజధాని మస్కట్ సముద్ర తీరంలో అరుదైన గులాబీ రంగు డాల్ఫిన్లు కనిపించడంతో వాటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కెమెరాకు చిక్కిన ఈ అరుదైన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. డాల్ఫిన్ల శరీరంపై కనిపించే గులాబీ రంగుకు చర్మపు సహజ రంగు వైవిధ్యాలు, చర్మం పలుచగా ఉండటం వల్ల రక్తనాళాలు కనిపించడం వంటి అంశాలు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే కాంతి ప్రభావం కూడా వాటి రంగు కనిపించే తీరును మార్చవచ్చు. అమెజాన్ నదిలో కనిపించే పింక్ రివర్ డాల్ఫిన్లు ప్రసిద్ధి చెందగా, ఇతర ప్రాంతాల్లోనూ కొన్ని డాల్ఫిన్ జాతుల్లో గులాబీ ఛాయలు కనిపిస్తాయి. మస్కట్ తీరంలో కనిపించిన డాల్ఫిన్లు ఏ జాతికి చెందినవో నిర్ధారించేందుకు మరింత సమాచారం అవసరం
.