BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ టీడీపీలో రెబల్స్‌పై వేటు.. ఏడుగురు నేతల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Oct, 2026 - 06:15 PM
12 వీక్షణలు

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, పార్టీ నిర్ణయాలను ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఏడుగురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో నెలకొన్న అసంతృప్తి కారణంగా కొందరు నేతలు రెబల్స్‌గా పోటీ చేస్తుండటంతో పార్టీ అధిష్ఠానం ఈ చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కూటమి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకే సస్పెన్షన్ వేటు వేసినట్లు పార్టీ స్పష్టం చేసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో కాకొల్లు మహేంద్ర నాథ్ (బాబీ), దేవరపు మాల్యాద్రి, గెడ్డం శ్రీనివాసరావు, కోట నారాయణ, చంద్రశేఖర్, కొమ్మినేని సురేశ్‌, మాదాల సత్యవతి ఉన్నారు. సస్పెండైన నేతలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ ప్రకటించింది. ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను ఈ నిర్ణయం ద్వారా పార్టీ నాయకత్వం పంపింది.