రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం
రెడ్‌క్రాస్ సేవల విస్తరణకు సహకరిస్తా: పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి
అంకాపూర్ (ఎన్ టుడే న్యూస్): రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించి సభ్యుడిగా ఎన్నికవడంతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన జెస్సు అనిల్ కుమార్‌ను జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఘనంగా సన్మానించారు. తన స్వగ్రామమైన అంకాపూర్‌కు రావాలని పల్లె గంగారెడ్డి ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి జెస్సు అనిల్ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవలందించే కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.
రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా చేపట్టే సేవా కార్యక్రమాల విస్తరణకు పసుపు బోర్డు చైర్మన్‌గా తనవంతుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని పల్లె గంగారెడ్డి హామీ ఇచ్చారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ సహకారం కూడా ఉంటుందని తెలిపారు.
రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని జెస్సు అనిల్ కుమార్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.