BREAKING
thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత
Date of Publish : 20 October 2026, 08:39 pm
Posted by : V శ్రీనివాస్

రూ.4.94 కోట్లతో శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణం

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Oct, 2026 - 08:39 PM
10 వీక్షణలు

విజయదశమి సందర్భంగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల: పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు విజయదశమి పర్వదినం సందర్భంగా శ్రీకారం చుట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కుటుంబ సమేతంగా హాజరై, శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి రూ.4.94 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. దేవాలయాలు సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతి, చారిత్రక వారసత్వానికి ప్రతీకలని అన్నారు. భక్తుల మనోభావాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ఇందులో భాగంగా రూ.4.94 కోట్లతో శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించి, ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే తనయుడు కొక్కిరాల చరణ్ రావు, ఆలయ ఈవో ముక్త రవి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

అలాగే కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.