BREAKING
thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం
Date of Publish : 19 October 2026, 08:55 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

నేరళ్లపల్లిలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

తెలంగాణ
19 Oct, 2026 - 08:55 PM
6 వీక్షణలు

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

బాలానగర్: మండలంలోని నేరళ్లపల్లి గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు హెచ్‌ఎండీఏ నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

బాలానగర్ మండలంలోని పలు గ్రామాల్లో హెచ్‌ఎండీఏ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసిన నేపథ్యంలో తమ గ్రామానికి కూడా నిధులు కేటాయించాలని వారు కోరారు. నేరళ్లపల్లిలో మురుగునీటి సమస్య పరిష్కారానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, రహదారుల అభివృద్ధికి సీసీ రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించి, హెచ్‌ఎండీఏ నిధుల ద్వారా పనులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నేరళ్లపల్లి గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.