BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 25 August 2025, 07:42 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

రేషన్ డీలర్ల కమిషన్ ను వెంటనే విడుదల చేయాలని అధికారులకు వినతి

తెలంగాణ
25 Aug, 2025 - 07:42 PM
405 వీక్షణలు
రేషన్ డీలర్ల కమిషన్ ను వెంటనే విడుదల చేయాలని అధికారులకు వినతి NTODAY NEWS: బొమ్మలరామారం గత ఐదు నెలలుగా రేషన్ డీలర్లకు రావలసిన కమిషన్ రాక రేషన్ డీలర్ల కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వం రేషన్ డీలర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఐదు నెలల కమిషన్లను వెంటనే మంజూరు చేయాలని బొమ్మలరామారం రేషన్ డీలర్ల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం మండల శాఖ అధ్యక్షులు ధీరావత్ దశరథ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఇస్తానన్న గౌరవ వేతనం ఇవ్వడం లేదని కనీసం ప్రతినెల డీలర్లకు రావలసిన కమిషన్ కూడా ఐదు నెలల నుండి రాకపోవడంతో డీలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు మూడు నెలల బియ్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే నెలలో అమ్మాలని ఆదేశాలు ఇవ్వడంతో ఎన్నో సాధక బాధకాలు భరించి కూడా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జులై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలల బియ్యాన్ని ప్రజలకు అందించామని ఆయన తెలిపారు ఆ మూడు నెలల కమిషన్ తో పాటు అంతకుముందు రెండు నెలల కమిషన్ కలుపుకొని ఇప్పటివరకు డీలర్లకు ఐదు నెలల కమిషన్ రాకపోవడంతో డీలర్లు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వెలిబుచ్చారు రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తాహసిల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ వెంకటరెడ్డికి తక్షణమే కమిషన్ చెల్లించాలని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube